Shakeel Son Case : మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు ప‌రార్

రోడ్డు ప్ర‌మాదంలో ప్రమేయం ఉంది

Shakeel Son : హైద‌రాబాద్ – నిజామాబాద్ జిల్లా బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గం భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ష‌కీల్(Shakeel) కొడుకుకు బిగ్ షాక్ త‌గిలింది. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ‌డ‌మే కాకుండా ఇష్టానుసారంగా త‌న‌యుడు వ్య‌వ‌హ‌రించ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పోలీసులు. హైద‌రాబాద్ లోని ప్ర‌జా భ‌వ‌న్ స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Shakeel Son Case Viral

వేగంగా , నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ ప్ర‌మాదానికి సంబంధించి సంబంధం లేని వ్య‌క్తిని డ్రైవ‌ర్ అంటూ త‌ప్పుగా చూపించార‌ని పోలీసులు ఫైర్ అయ్యారు. చ‌ట్ట ప‌రంగా ఎదుర‌య్యే ప‌రిణామాల నుంచి త‌ప్పించు కునేందుకు మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ ప్ర‌య‌త్నం చేశాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాజాగా పోలీసుల విచార‌ణ‌లో డ్రైవ‌ర్ కాకుండా ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కుమారుడు ఉన్నాడ‌ని తేలింద‌ని తెలిపారు. ఈ మేర‌కు పోలీసులు నిర్ధారించ‌డంతో అంతా విస్తు పోయారు. ష‌కీల్ కుమారుడు రాహెల్ కోసం గాలింపు చ‌ర్యలు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు డీసీపీ విజ‌య్ కుమార్.

ఎక్క‌డ దాక్కున్నా ప‌ట్టుకుని తీరుతామ‌ని, చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై స్పందించ లేదు మాజీ ఎమ్మెల్యే ష‌కీల్.

Also Read : Pawan Kalyan : కాకినాడ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!