MLC Vamsikrishna Srinivas : వైసీపీకి షాక్ ఎమ్మెల్సీ జంప్
జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్
MLC Vamsikrishna Srinivas : ఏపీలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉన్నట్టుండి బిగ్ షాక్ తగిలింది వైసీపీ పార్టీకి. ఆ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
MLC Vamsikrishna Srinivas Resigned
మరికొందరు టికెట్లు రాని వారంతా అయితే టీడీపీలో లేదా జనసేన పార్టీలోకి(Janasena) జంప్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల బోగట్టా. ఇదిలా ఉండగా వంశీ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉందని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చెప్పారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.
తాను ఏ నమ్మకంతో తమ వైపు వచ్చారో ఆ నమ్మకం వమ్ము కాకుండా చూసే బాధ్యత తనపై ఉందన్నారు జనసేన పార్టీ చీఫ్. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్సీ.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక భూమిక పోషించ బోతోందన్నారు. ఇదే సమయంలో తాము టీడీపీతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. బలమైన వ్యక్తులు రాష్ట్ర స్థాయిలో ఎదగాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్.
Also Read : Anna Rambabu MLA : గిద్దలూరు నుండి తప్పుకుంటున్నా