Congress Praja Palana : నేటి నుంచి ప్ర‌జా పాల‌న

తెలంగాణ స‌ర్కార్ శ్రీ‌కారం

Congress : హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్(Congress) ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాము ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీలు అమ‌లు చేసేందుకు ఆప‌న్న హ‌స్తం ఇచ్చేందుకు శ్రీ‌కారం చుట్టింది. అభయ హ‌స్తం పేరుతో ప్ర‌క‌టించిన సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తులను ప్ర‌క‌టించింది.

Congress Praja Palana Viral

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయ‌తీలు, 3,626 పుర‌పాలిక వార్డుల‌తో క‌లిపి మొత్తం 16,395 ప్ర‌దేశాల‌లో ప్ర‌జా పాల‌న స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేసింది స‌ర్కార్. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి.

ప్ర‌జ‌లు అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ద్ద‌కు కాకుండా అధికారులే జ‌నం వ‌ద్ద‌కు వ‌చ్చేలా జ‌న రంజ‌క పాల‌న సాగిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా గ‌తంలో కొలువు తీరిన గులాబీ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

డిసెంబ‌ర్ 28 నుంచి జ‌న‌వ‌రి 6వ తేదీ వ‌ర‌కు ప్ర‌జా పాల‌న సాగుతుంద‌ని చెప్పారు సీఎం. ఆరు ప‌థ‌కాలు కావాల్సిన ప్ర‌జ‌లు స్వ‌యంగా ద‌ర‌ఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. లేదా ఆన్ లైన్ లో కూడా న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ గ‌డువు తీరినా ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలు క‌ల్పిస్తామ‌న్నారు.

Also Read : Dasoju Sravan : ద‌ర‌ఖాస్తుల పేరుతో ద‌గా

Leave A Reply

Your Email Id will not be published!