AP CM YS Jagan : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
AP CM YS Jagan : అమరావతి – తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). తాడేపల్లి గూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు అత్యంత కీలకమైని పేర్కొన్నారు సీఎం.
AP CM YS Jagan
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ , ఆసరా, చేయూత, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
జనవరి 3న, ఫిబ్రవరి 1న మొత్తం నాలుగు ప్రధాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. కొత్త సంవత్సరంలో తీపి కబురు చెప్పారు సీఎం. ఈ మేరకు జనవరి 1 నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ. 3,000లకు పెంచుతున్నట్లు తెలిపారు.
గత సర్కార్ హయాంలో పెన్షన్ కేవలం రూ. 1,000 మాత్రమే ఉండేదని తాము వచ్చాక దానిని రూ. 2,250కి చేశామని ఇప్పుడు అదనంగా మరో రూ. 750 చేర్చి రూ. 3 వేలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నెలకు రూ. 1950 కోట్లు పెన్షన్ల రూపేణా ఇస్తున్నామని ఇప్పుడు వీటిని అందుకున్న వారి సంఖ్య 66 లక్షలకు చేరిందన్నారు.
సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయికి తీసుకు వచ్చామని అన్నారు జగన్ రెడ్డి. నాలుగున్నర ఏళ్లలో ప్రజా రంజక పాలన అందించామని తన సందేశం, లేఖ ప్రతి ఒక్కరికీ చేరాలని పిలుపునిచ్చారు.
Also Read : Congress Six Guarentees Comment : ఆరు గ్యారెంటీలు అమలయ్యేనా