Ambedkar Statue : 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ
స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్
Ambedkar Statue : అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. భారీ ఖర్చుతో విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాజ్యాంగ స్పూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చే నెల జనవరి 19న ఆవిష్కరిస్తామని వెల్లడించారు.
Ambedkar Statue opening on Jan 19th
ఈ విగ్రహాన్ని 19 ఎకరాలలో రూ. 404 కోట్లతో 125 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఇప్పటికే విగ్రహ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి అడుగు లోనూ సామాజిక న్యాయం కనిపించాలి, వినిపించాలని అన్నారు.
రాజ్యాంగ నిర్మాతగా, బడుగులు, బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా డాక్టర్ బాబా సాహెబ్ భీం రావ్ అంబేద్కర్(Ambedkar) నిలిచారని కొనియాడారు. ఆయన అందించిన స్పూర్తి కలకాలం నిలిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన కన్న కలలను తాము సాకారం చేశామన్నారు.
అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరిగిందని, పేదలు సైతం తమ కాళ్ల మీద నిలబడేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చిందని తెలిపారు.
Also Read : AP CM YS Jagan : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం