IND vs SA 1st Test : బౌలర్ల ప్రతాపం భారత్ పరాజయం
సఫారీల దెబ్బకు బ్యాటర్ల విలవిల
IND vs SA 1st Test : సఫారీల దెబ్బకు రోహిత్ సేన విల విల లాడింది. బౌలర్లు రెచ్చి పోవడంతో తొలి టెస్టులో పరాజయం పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ర్యాంకు పడి పోయింది. ఇక ఫైనల్ కు వెళ్లాలంటే వరుసగా విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది టీమిండియాకు.
IND vs SA 1st Test Updates
దక్షిణాఫ్రికా బౌలర్లు రెచ్చి పోవడంతో టీమిండియా బ్యాటర్లు విల విల లాడారు. ఒకానొక దశలో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశారే తప్పా ఏ కోశాన పోరాడేందుకు ట్రై చేయలేదు. దీంతో ఒకరి వెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు.
ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్ ఉన్నట్టుండి మూడు రోజులకే ముగిసింది. ప్రపంచ క్రికెట్ లో అత్యున్నతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ సఫారీలను ఎదుర్కోవడంలో చేతులెత్తేశారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Viral Kohli) తప్ప ఏ ఒక్క ఆటగాడు క్రీజులో నిలవలేక పోయారు.
దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు కనీసం చివరి మ్యాచ్ లోనైనా సత్తా చాటుతుందో లేదో చూడాలి. ఇన్నింగ్స్ ఓటమి పాలైంది . 32 పరుగుల తేడాతో ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఈ ఒక్క ఓటమి కారణంగా పాయింట్ల పట్టికలో ఏకంగా 5వ ప్లేస్ కు దిగజారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత ఇండియా ఆడింది. 245 పరుగులకే చాప చుట్టేసింది. సఫారీ టీం 408 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 131 రన్స్ కే తిరుగు ముఖం పట్టింది.
Also Read : Chiranjeevi : బ్రహ్మానందం జీవితానుభవం ప్రశంసనీయం