RGV Vyooham : ఆర్జీవీకి షాక్ వ్యూహంకు బ్రేక్

హైకోర్టు తీవ్ర అభ్యంత‌రం

RGV Vyooham : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు(Ram Gopal Varma) బిగ్ షాక్ త‌గిలింది. హైకోర్టు త‌ను తీసిన వ్యూహం చిత్రం విడుద‌ల‌కు బ్రేక్ వేసింది. మాజీ సీఎం వైఎస్సార్ మ‌ర‌ణం అనంత‌రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఎలాంటి కుట్ర‌లు ప‌న్నార‌నే దానిని ఆధారంగా చేసుకుని ఆర్జీవీ వ్యూహం తెర‌కెక్కించారు. 2009 నుంచి 2014 వ‌ర‌కు ఏం జ‌రిగింద‌నే దానిపై ఉత్కంఠ రేపేలా తీశారు. అయితే మూవీకి సంబంధించి తీసిన స‌న్నివేశాలు, డైలాగులు తీవ్ర అభ్యంత‌ర‌కరంగా ఉన్నాయంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కోర్టును ఆశ్ర‌యించారు.

RGV Vyooham Got Break

ఈ చిత్రంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, భార‌తి, ష‌ర్మిల‌, నారా చంద్ర‌బాబు నాయుడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను పోలుస్తూ పాత్ర‌ల‌ను రూపొందించ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నారా లోకేష్ తో పాటు టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌ధానంగా ఆర్జీవీ బాబును టార్గెట్ చేస్తూ సినిమా తీశాడ‌ని ఆరోపించారు.

విచిత్రం ఏమ‌టంటే పిటిష‌న్ ఆర్జీవీ వ్యూహంకు వ్య‌తిరేకంగా తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం విశేషం. ఇదే సినిమాకు సంబంధించి తీవ్ర స్థాయిలో వాద‌న‌లు కొన‌సాగాయి. ఏకీభ‌వించిన కోర్టు వ్యూహం విడుద‌ల‌ను నిలిపి వేసింది. జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు నిలిపి వేస్తూ తీర్పు చెప్పింది.

Also Read : Chiranjeevi : బ్ర‌హ్మానందం జీవితానుభ‌వం ప్ర‌శంస‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!