Eatala Rajender : ప్రజలే చరిత్ర నిర్మాతలు – ఈటల
ప్రజాస్వామ్యం అత్యున్నతమైన సాధనం
Eatala Rajender : హైదరాబాద్ – బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలే చరిత్ర నిర్మాతలను వారిని కాదని ఎవరూ దానిని నిర్మించ లేరన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన సామాజిక సాధనం ఏదైనా ఉందంటే అది ప్రజాస్వామ్యం మాత్రమేనని అన్నారు.
Eatala Rajender Comment
హైదరాబాద్ లోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ లో నిర్వహించిన మెగా అలుముని మీట్ -2023లో పాల్గొని ప్రసంగించారు ఈటల రాజేందర్(Eatala Rajender). పల్లెటూరులో పుట్టిన నాకు ఈ కాలేజీకి వచ్చాక ఎన్నో తెలుసుకునే అవకాశం దక్కిందని గుర్తు చేశారు. 1981 నుండి 1984 వరకు హాస్టల్ లో ఉండి డిగ్రీ చదువుకున్నానని అన్నారు .
స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాలేజీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారని , అరే అని పిలిచే హక్కు ఒక్క స్కూల్, కాలేజీలో చదువుకున్న స్నేహితుడికి మాత్రమే ఉంటుందన్నారు ఈటల రాజేందర్.
ఆనాటి విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండేదని కానీ ఇవాళ అది కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తప్పుదారి పడితే మొత్తం వ్యవస్థకే పెను ముప్పు అని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్నారు.
సమాజాన్ని డ్రైవ్ చేసే సత్తా ఉన్నవాళ్లు మనకెందుకులే అనుకోవడం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద రాజకీయాల మీద అసహ్యించు కోవడం కంటే మన తల రాతలు మార్చే వ్యవస్థల మీద కాస్త దృష్టి పెట్టాలని సూచించారు ఈటల రాజేందర్.
రాజకీయ నాయకుణ్ణి పనితీరును బట్టి ఎన్నుకోవాలి తప్ప వారి ప్రామిసెస్ ను బట్టి కాదు. నేను సైన్స్ విద్యార్థిని.. కానీ ఆర్థికవేత్తను కాను. తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్ధిక మంత్రిగా నా ప్రసంగంలో మొదటి పేరాలో ఒక లైన్ రాశాను.
ఈడబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే భాద్యత ఉంది అని చెప్పిన. అది సైఫాబాద్ సైన్స్ కాలేజీ నేర్పిన చైతన్యమన్నారు.
Also Read : Ponnam Prabhakar : కార్మికులకు సామాజిక భద్రతా పథకం