Jhansi Rajender Reddy : సీఎంను కలిసిన ఝాన్సీ రెడ్డి
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు భూమి పూజ
Jhansi Rajender Reddy : హైదరాబాద్ – ప్రముఖ పారిశ్రామికవేత్త, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ , ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రాజేందర్ రెడ్డి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని(Revanth Reddy) కలుసుకున్నారు. సచివాలయంలో ఈ సందర్భంగా నూతన సీఎంగా కొలువు తీరిన ఆయనను ఘనంగా సన్మానించారు.
Jhansi Rajender Reddy
గత కొన్నేళ్లుగా స్వచ్చంధంగా లక్షలాది రూపాయలు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మందికి మేలు చేకూరింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు, యువతీ యువకులకు ప్రతిభా నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా ఝాన్సీ రెడ్డి, ఆమె భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజేందర్ రెడ్డి పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు పాలకుర్తి నియోజకవర్గాన్ని. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. అంతే కాకుండా ఎక్కడా లేని రీతిలో స్వచ్చంధంగా భారీ ఖర్చుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇందుకు గాను జనవరి 3న తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో నిర్వహించే సెంటర్ భూమి పూజకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
Also Read : Actor Shivaji : మెగా ఫ్యామిలీపై శివాజీ కామెంట్స్