Minister Ambati Rambabu: భోగి మంటల వద్ద మంత్రి అంబటి స్పెషల్ డ్యాన్స్

భోగి మంటల వద్ద మంత్రి అంబటి స్పెషల్ డ్యాన్స్

Minister Ambati Rambabu: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఎక్కడికక్కడ భోగి మంటలతో తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాతిని జరుపుకుంటున్నారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని గాంధీ బొమ్మల సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ భోగి మంటలతో ప్రారంభమైన ఈ సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబుతో సహా ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటల చుట్టూ మంత్రి రాంబాబు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు. సంబరాల రాంబాబు పేరుతో ఒక ప్రత్యేక సాంగ్ ను రూపొందించి… దాని మ్యూజిక్ కు అనుగుణంగా మంత్రి అంబటి రాంబాబు, బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం మంత్రి రాంబాబు స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Minister Ambati Rambabu Dance Viral

గత ఏడాది సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) అనుకోకుండా భోగి మంటల చుట్టూ డ్యాన్సులు వేసారు. అయితే మంత్రి వేసిన డ్యాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… టీడీపీ, జనసేన సోషల్ మీడియా మద్దత్తు దారులు అంబటి డ్యాన్సులపై వ్యంగ్యంగా స్పందించారు. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన బ్రో సినిమాలో… మంత్రి అంబటి రాంబాబు భోగి డ్యాన్స్ కు పేరడీగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీతో శ్యాంబాబు పేరిట నాన్ సింక్ లో డ్యాన్స్ వేసే సీన్ ను పెట్టారు. దీనితో ఆ సీన్ పై రాజకీయంగా వివాదం చెలరేగింది. మంత్రి అంబటి రాంబాబు… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, చిత్ర నిర్మాతలపై కూడా విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతికి మంత్రి అంబటి రాంబాబు… ప్రత్యేకంగా సంబరాల రాంబాబు పేరిట ఓ పాటను రూపొందించి భోగీ మంటల సాక్షిగా డ్యాన్సులు వేసారు. ప్రొఫెనల్ డ్యాన్సర్లతో కలిసి అంబటి స్టెప్పులు వేసారు. దీనితో భోగీ రోజున డ్యాన్సులు వేయడానికి మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేకంగా నెల రోజుల నుండి కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో డ్యాన్స్ ప్రాక్టీసు చేసినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనితో ఈ ఏడాది డ్యాన్సులు కూడా రాజకీయ వివాదాలకు కారణం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మద్దత్తు దారులు ఈ ఫోకస్ డ్యాన్సులపై కాకుండా పోలవరం ప్రాజెక్టుపై పెట్టింటే బాగుండేది అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.

Also Read : Bhogi 2024 Updates : భోగి రోజున పిల్లలకు రేగిపళ్ళను భోగి పళ్ళు గా ఎందుకు పోస్తారు..?

Leave A Reply

Your Email Id will not be published!