Kakani Govardhan Reddy: కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో మంత్రి కాకాణికి క్లీన్‌చిట్‌ ?

కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో మంత్రి కాకాణికి క్లీన్‌చిట్‌ ?

Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో మంత్రి కాకాణి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని సీబీఐ తన చార్జ్‌ షీట్‌ పేర్కొంది. ఈ కేసులో ఏడాదిపాటు విచారణ జరిపిన సీబీఐ… 403 పేజీల చార్జ్‌షీట్‌ ను కోర్టులో దాఖలు చేసింది. తమ విచారణలో 88 మంది సాక్షకులను విచారామన్నా సీబీఐ… మంత్రి కాకాణికి ఈ కేసు దోషులతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
దీనితో మంత్రి కాకాణికి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. సీబీఐ చార్జ్ షీట్ పై స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)… టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.

Kakani Govardhan Reddy Case

ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… “నెల్లూరు కోర్టు ఫైల్ మిస్సింగ్ కేసులో నాపై వచ్చిన ఆరోపణలకు నేను సీబీఐ విచారణ కోరాను. సీబీఐ చార్జ్ షీట్ తో ఈ కేసులో నాకు క్లీన్ చిట్ లభించింది. ఇది కేవలం చంద్రబాబు, అతని అనుబంధ మీడియాల దుష్పచారం అని ఆరోజే చెప్పాను. అయినప్పటికీ సీబీఐ విచారణ కోరి నేడు నిర్ధోషిగా కేసు నుండి బయటపడ్డాను. మరి చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా అని నేను సవాల్ విసురుతున్నాను. చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారు. చంద్రబాబుపై వస్తున్న ఆరోపణలకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరగలరా ? బాబు తనకు తాను నిజాయితీ పరుడు అని భావిస్తే వెంటనే తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోరాలి’’ అంటూ మంత్రి కాకాణి డిమాండ్‌ చేశారు.

Also Read : Rahul Gandhi: వైఎస్‌ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఖండించిన రాహుల్‌ గాంధీ !

Leave A Reply

Your Email Id will not be published!