Manish Sisodia: మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత సిసోడియాకు ఉపశమనం !

మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత సిసోడియాకు ఉపశమనం !

Manish Sisodia: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఉపశమనం లభించింది. తన మేనకోడలు వివాహానికి హాజరు కావడానికి… రూస్ అవెన్యూ కోర్టు సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు. ఈ మేరకు రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులు బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు మనీష్‌ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం.

Manish Sisodia Case Updates

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్‌ సిసోడియాను(Manish Sisodia) 26, ఫిబ్రవరి 2023న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ కేసు విచారణలో ఉంటుండగానే మనీ లాండరీంగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సైతం మార్చి 9న ఆయన్ను ఆరెస్ట్‌ చేసింది. సుమారు ఏడాది నుండి మనీష్ సిసోడియా వివిధ కేసుల్లో జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహార్‌ జైల్లో ఉన్నారు. అయితే ఆయన భార్య ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ అనే అరుదైన సమస్యలతో బాధపడుతున్నారు. దీనితో అనారోగ్యంతో బాధపడుతోన్న తన భార్యను వారానికి ఒకసారి పరామర్శించేందుకు కొద్దిరోజుల క్రితం ఢిల్లీ కోర్టు సిసోడియాకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తన మేనకోడలు వివాహానికి హజరుకావడానికి… తనకు మూడు రోజులు బెయిల్‌ ఇవ్వాలని మనీష్‌ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ మధ్యంతర బెయిల్‌ ఇచ్చారు.

Also Read : APPSC Group 2: ఫిబ్రవరి 14 నుండి గ్రూప్‌- 2 అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు !

Leave A Reply

Your Email Id will not be published!