Vijay Opposes CAA: సీఏఏ అమలుపై తమిళ సర్కారుకు విజయ్ కీలక విజ్ఞప్తి !
సీఏఏ అమలుపై తమిళ సర్కారుకు విజయ్ కీలక విజ్ఞప్తి !
Vijay Opposes CAA: పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేయడంపై కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షులు దళపతి విజయ్ స్పందించారు. సిఏఏ అమలుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. అంతేకాకుండా సీఏఏను తమిళనాడులో అమలు చేయవద్దంటూ సీఎం స్టాలిన్ కు సూచించారు.
Vijay Opposes CAA Viral
‘‘పౌరసత్వ సవరణ చట్టం అమలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో దీన్ని అమలు చేయకూదని కోరుతున్నాను. ఈ అంశంపై ప్రభుత్వ నేతలు ప్రజలకు హామీ ఇవ్వాలి’’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని విజయ్(Vijay) కోరారు. ఇది ఇలా ఉండగా సీఏఏ అమలుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఢిల్లీలోని ఆప్, బెంగాల్ లోని టీఎంసీ, కేరళలోని సీపీఎం ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందంటూ కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో దీన్ని తమ రాష్ట్రంలో అమలుచేయబోమని స్పష్టం చేశారు.
‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి ఇటీవల రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్… ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు ఇతర పార్టీలకు మద్దతు కూడా ఇవ్వబోమన్నారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజయ్ చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.
Also Read : Rishab Panth Re-entry : రిషబ్ పంత్ హెల్త్ పై కీలక ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ..