CM Jagan: గీతాంజలి ఉదంతం స్పందించిన సీఎం జగన్‌ ! రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన !

గీతాంజలి ఉదంతం స్పందించిన సీఎం జగన్‌ ! రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన !

CM Jagan: సోషల్ మీడియాలో ట్రోల్స్ భరించలేక రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడిన తెనాలి మహిళ గీతాంజలి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు… ఆమె కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

CM Jagan Comment

తెనాలికి చెందిన గీతాంజలి అనే వివాహిత ఈ నెల 5న నిర్వహించిన ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని… అక్కడ వైసీపీ(YCP) సోషల్ మీడియా విభాగంకు ఇచ్చిన ఇంటర్వూలో… వైసీపీ ప్రభుత్వం నుండి తాను పొందిన ప్రయోజనాలు వివరించింది. దీనిలో భాగంగా తాను ఐదు సార్లు అమ్మ ఒడి పథకం క్రింద డబ్బులు అందుకుని ఒకసారి ఫిక్స్ డ్ డిపాజిట్ కూడా చేసాను అని చెప్పింది. తాజాగా స్వంత ఇంటి కల తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను సీఎం జగన్(CM Jagan) ఫుల్ ఫిల్ చేసారని చాలా ఆనందంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. దీనిని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… దానికి టీడీపీ, జనసేనకు చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు కౌంటర్లు ఇచ్చారు.

జగనన్న ప్రభుత్వం నాలుగు సార్లు అమ్మ ఒడి ఇస్తే… నీకు ఐదు సార్లు ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదు ఐటీడీపీకు చెందిన అజయ్ సజ్జా అనే వ్యక్తి గీతాంజలి చేసిన వ్యాఖ్యల్లో తప్పులను ఎత్తు చూపుతూ వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే ఆమె అనూహ్యంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో వైసీపీకు చెందిన మహిళా నాయకులు, బీసీ నాయకులు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన సోషల్ మీడియాపై విమర్శలు చేస్తున్నారు.

అయితే ఓ బీసీ మహిళ మృతిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు, సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తున్నారు. గీతాంజలి మాట్లాడిన వీడియోను 5వ తేదీన యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తే… ఆమె 7వ తేదీ ఉదయం జన్మభూమి ఎక్స్ ప్రెస్ క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడిందని… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 11వ తేదీన మృతి చెందిన తరువాత వైసీపీ(YCP) సోషల్ మీడియా దీనిని రాజకీయం చేసిందని మండిపడుతున్నారు. వైసీపీ నాయకులు ఆరోపించిన స్వాతి చౌదరి, అజయ్ సజ్జా ఇద్దరూ 8వ తేదీన ఆమెకు కౌంటర్ గా మాట్లాడారని… అప్పటికే ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వారికి తెలియదని అంటున్నారు.

Also Read : Speaker Disqualified MLC: ఫిరాయింపు ఎమ్మెల్సీలపై శాసన మండలి చైర్మన్‌ అనర్హత వేటు !

Leave A Reply

Your Email Id will not be published!