CM YS Jagan: జనంలోకి సీఎం జగన్ ! నెల రోజుల పాటు బస్సు యాత్ర !
జనంలోకి సీఎం జగన్ ! నెల రోజుల పాటు బస్సు యాత్ర !
CM YS Jagan: సార్వత్రిక ఎన్నికల నగారా మ్రోగడంతో ఏపీలోని అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వైనాట్ 175 లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవలే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం… ప్రస్తుతం మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా ఉంది. ఇప్పటికే సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి… త్వరలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
CM YS Jagan Bus Yatra Updates…
దీనిలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(CM YS Jagan) రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఈ నెల 26 లేదంటే 27వ తేదీన ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుందని తెలుస్తోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పోలింగ్ కు మరో 55 రోజులు ఉండడంతో వచ్చే రోజుల్లో వీలైనంతవరకు ప్రజల మధ్యనే ఉండేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఎన్నికల ప్రచార షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రూపకల్పన చేయబోతోందని తెలుస్తోంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. అన్ని వర్గాలను కలవడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి గురించి మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read : MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సంచలన ప్రకటన !