Janasena: జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్ !
జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్ !
Janasena: జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు ఆ పార్టీ నేతలు గుర్తించారు. దీనితో యూట్యూబ్ ఛానెల్ సరి చేసేందుకు నిపుణులను ఆగ మేఘాల మీద రంగంలోకి దింపారు. అయితే ఈ చానెల్‌ను విదేశాల్లో హ్యాక్ చేసినట్లు వారు గుర్తించారు. సాంకేతికపరమైన సెట్టింగ్‌లను నిపుణుల బృందం మారుస్తుంది. మళ్లీ యాధావిధిగా యూట్యూబ్ చానెల్ ప్రసారమయ్యేలా నిపుణులు చర్యలు చేపట్టారు. అయితే కావాలని కుట్రతోనే పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్ చేశారని జనసేన పార్టీ(Janasena) నేతలు ఆరోపిస్తున్నారు.
Janasena YouTube Channel..
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే అధికార జగన్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఓ ప్రచారం అయితే వైరల్ అవుతోంది. అదీకాక ఆ పార్టీలోని కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కట్టారు.. కడుతోన్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ వరుసగా అధికారాన్ని దక్కించుకొనేందుకు వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిందంటే.. అందుకు యూట్యూబ్‌లో ప్రసారమైన రాజకీయ పార్టీల యాడ్లే అందుకు కారణమని ఓ చర్చ అయితే ఇప్పటికే జనసామాన్యంలో నలుగుతోంది. అలాంటిది ఎన్నికల సమయంలో జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్ కావడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికార పార్టీ కుట్రేనని వారు ఆరోపణలు సంధిస్తున్నారు.
Also Read : CM YS Jagan : సీఎం జగన్ పై రాయితో దాడి ! కంటికి స్వల్ప గాయం !