Mallu Bhatti Vikramarka: నైనీ బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తాం – సీఎం మోహన్ చరణ్ మాఝీ
నైనీ బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తాం - సీఎం మోహన్ చరణ్ మాఝీ
Mallu Bhatti Vikramarka: ఒడిశాలోని అంగుల్ జిల్లా పరిధిలోని నైనీ ప్రాంతంలో సింగరేణి బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హామీ ఇచ్చారు. తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka)… శుక్రవారం భువనేశ్వర్ వెళ్లి గనులకు అవసరమైన అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయిస్తే బొగ్గు తవ్వకాలను ప్రారంభిస్తుందని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దానికి మాంఝీ వెంటనే స్పందించారు.
Mallu Bhatti Vikramarka Meet
2017లోనే సింగరేణికి కేంద్రం నైనీ గనులను కేటాయించింది. వాటికి భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల నిర్మాణ సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆ గనుల సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో 1,600(2800) మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దానికి స్థల కేటాయింపు, ఇతర అనుమతులు కూడా మంజూరు చేయాలని భట్టి కోరగా దానికి కూడా ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ గనులతో ఒడిశా రాష్ట్ర యువకులకు ఉపాధి అవకాశాలతో పాటు, ఆ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఏటా రూ.600 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని డిప్యూటీ సీఎం… మాంఝీకి వివరించారు. దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి ఆ గనులు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. వాటికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిశా సీఎంకు అందజేశారు.
Also Read : Meira Kumar: ప్రధాని మోదీకు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ చురకలు !