CM Nara Chandrababu : ఎంపీలతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు...
CM Nara Chandrababu : తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులతో ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ ఈ భేటీకి ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
CM Nara Chandrababu Meet
కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖలు చొప్పున బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. నేటి సమావేశంలో మంత్రులను కూడా ఎంపీలకు సీఎం జతచేయనున్నారు.
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు(CM Nara Chandrababu) దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల సాధనపై చర్చించారు. జలజీవన్ మిషన్, క్రిషి సించాయీ యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయంపై మాట్లాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.
Also Read : Minister Nimmala : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై కీలక సమీక్షా ఏర్పాటు చేసిన మంత్రి