Delhi Liquor Scam : మరోసారి వాయిదా పడ్డ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణ
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు...
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు రాగా… ఆగస్టు 5కు కోర్టు వాయిదా వేసింది. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందని జూలై 8న కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. సీబీఐ కవిత(MLC Kavitha)ను 2024 ఏప్రిల్ 11న అక్రమంగా అరెస్టు చేసిందని కోర్టుకు తెలిపారు. జూన్ 7న సీబీఐ అసంపూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.
సీబీఐ చార్జ్‌షీటులో తప్పులు ఉన్నాయని కోర్టు కూడా పేర్కొంది. సీఆర్పీసీ167(2) ప్రకారం కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉందని… ఏడు ఏళ్ళ శిక్ష పడే కేసులో 60 రోజుల వరకు మాత్రమే కస్టడీకి అవకాశం ఉందని… తాము డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జూలై 6 తేదీ నాటికి కవిత 86 రోజుల కస్టడీ పూర్తి అయ్యిందని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు గతంలో వాదనలు వినిపించారు. ఈరోజు మరోసారి పిటిషన్‌పై విచారణకు రాగా.. కోర్టు ఆగస్టు 5కు వాయిదా వేసింది.
Delhi Liquor Scam…
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో అరెస్ట్ అయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ… కవితను అదుపులోకి తీసుకున్నాయి. అయితే కవిత అరెస్ట్ నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనేక మార్లు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ వేయడం… అందుకు కోర్టు ధిక్కరచడం షరా మామూలుగా మారింది. దీంతో గత కొద్ది నెలలుగా కవిత జైలు జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. తాజాగా కవిత తరపున లాయర్లు కీలకమైన అంశాన్ని బెయిల్ పిటిషన్‌లో పొందుపరుస్తూ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందంటూ కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ కోర్టు మరోసారి వాయిదా వేసింది. దీంతో మరికొంత కాలం కవిత జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : Speaker Ayyanna : గవర్నర్ ను రాచమార్గంలో హుందాగా తీసుకొచ్చాము