Puja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రిపై కేసు నమోదు !
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రిపై కేసు నమోదు !
Puja Khedkar: వివాదాస్పద ప్రొబెషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ పై కేసు నమోదైంది. పుణె కలెక్టరేట్ కు చెందిన తహసీల్దార్ దీపక్ అకాడే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. ట్రైనీ ఐఏఎస్ గా విధులు నిర్వహిస్తున్న తన కుమార్తెకు ప్రత్యేక క్యాబిన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ… దిలీప్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తహసీల్దార్ దీపక్ అకాడే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Puja Khedkar..
పూజా ఖేద్కర్ కు అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చిన సమయంలో ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ తనను బెదిరించారని, పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేకపోయినప్పటికీ తన కుమార్తెకు క్యాబిన్ కేటాయించాలని డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఓ భూవివాదం వ్యవహారంలో పూజ తల్లి మనోరమ కొందరిని పిస్టోల్‌తో బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. దీనితో ఆమె పైనా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.
పుణెలో సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్(Puja Khedkar)పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్ కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్‌లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందిందని తేలడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్ ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో మరే ఇతర పరీక్షలు రాయకుండా ఆమెను శాశ్వతంగా డిబార్ చేసింది. అంతేకాదు ఛీటింగ్, బెదిరింపుల కేసులో పూజా ఖేద్కర్ పై కూడా కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో పూజా ఖేద్కర్ దేశం విడిచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరగుతోంది.
Also Read : Deputy CM Bhatti : ఆగస్టు 15 న రైతన్నలకు రుణ విముక్తి కల్పిస్తాం