KTR: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేకు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ !
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేకు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ !
KTR: తెలంగాణలో రైతు రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ రాశారు. రూ.40వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని, కానీ రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు కేటీఆర్(KTR) లేఖలో పేర్కొన్నారు. సీఎం మాటలకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు మధ్య స్పష్టమైన తేడా ఉన్నట్లు ఆయన చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ అంటూ వారిని నట్టేట ముంచారని ఆగ్రహించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం రైతులకు ఇచ్చిన మాటను రాహుల్ గాంధీ నిలబెట్టుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నా.. ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను లేఖలో కేటీఆర్ వివరించారు.
40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచింది. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలి. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారు. సీఎం మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే.. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పైన పోరాడతాం’’ అని కేటీఆర్(KTR) హెచ్చరించారు.
KTR – వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే !
ఎన్నికలకు ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రూ.2లక్షలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని కేటీఆర్(KTR) గుర్తు చేశారు. అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు అందరికీ మాఫీ అమలు చేయాల్సి ఉండగా.. అనేక షరతులు పెట్టి కేవలం 40శాతం మందికి మాత్రమే మాఫీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది అన్నదాతల తరఫున లేఖ రాస్తున్నట్లు ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. వేల కోట్లు రైతులకు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. అనేక షరతులు పెట్టి అన్నదాతల ఖాతాల్లో నగదు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. సీఎం మాటలకి క్షేత్రస్థాయి వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. కచ్చితంగా వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే అని లేఖలో డిమాండ్ చేశారు.
రైతులు రోడ్లెక్కారు !
రుణమాఫీ కాని లక్షల మంది రైతన్నలు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని, వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాటకు రాహుల్ గాంధీ కట్టుబడి అర్హులైన అన్నదాతలందరికీ మాఫీ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. లేకుండా బాధితుల తరఫున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు.
Also Read : Harbhajan Singh: కోల్ కతా ఘటనపై స్పందించిన హర్భజన్ సింగ్ !