Minister Vasamsetti Subhash: మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డ మంత్రి సుభాష్ !
మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డ మంత్రి సుభాష్ !
మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డ మంత్రి సుభాష్ !
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా ప్రమాదం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ… ‘‘జగన్‌కు ఇదే నా సవాల్’’.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు ఏనాడు కార్మికుల సంక్షేమం పట్టలేదు అని అన్నారు. అసలు కార్మికుల ప్రాణాలపై ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిందన్నారు. గత వైసీపీ పాలనలో పారిశ్రామిక ప్రమాదాల్లో కార్మికులు మరణించినప్పుడు సీఎం హోదాలో జగన్ ఏ రోజు తక్షణం పరామర్శకు రాలేదు. భవనిర్మాణ కార్మికులను జగన్ వేధించారు… వారి నిధులను దారి మళ్లించారు. అలాంటి జగన్ ఇప్పుడు కార్మికుల బాగోగుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ మంత్రి సుభాష్ వ్యాఖ్యలు చేశారు..
జగన్ శవ రాజకీయాలు మానుకో – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
ఫార్మా ప్రమాదంపై మొసలికన్నీరు కారుస్తున్న వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాట్లాడుతూ మంత్రులు స్పాట్ కు వెళ్ళలేదని… ప్రభుత్వం తీరు బాలేదని అనడం చూస్తే అయన మానసికస్థితి అర్థమవుతోందన్నారు. గతంలో సేఫ్టీ ఆడిట్ జరగలేదని అందుకే ప్రమాదానికి కారణమని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. జగన్ … శవ రాజకీయాల మీద పుట్టి… హత్య రాజకీయాల మీద పెరిగారన్నారు. జగన్మోహన్ రెడ్డి హావబావాలు చూస్తే, ఎలా ఉన్నాయో ప్రజలందరూ చూశారన్నారు. బాధితులతో నవ్వుతూ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. జగన్ ఇప్పటికైనా బాధిత కుటుంబాల పట్ల వారికి రక్షణగా ఉండాలన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్‌ను కూడా డైవర్ట్ చేశారన్నారు. టీడీపీ ఎప్పుడు బాధితుల పక్షాన అండగా ఉంటుందని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.