Prathipati Pulla Rao: యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం రేగడం బాధాకరం: ప్రత్తిపాటి పుల్లారావు

యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం రేగడం బాధాకరం: ప్రత్తిపాటి పుల్లారావు

Prathipati Pulla Rao: యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం రేగడం బాధాకరమని పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) అన్నారు. పుట్టినరోజు పరిణామాలు అనుకోకుండా జరిగాయని చెప్పారు. చిలకలూరిపేటలో ట్రాఫిక్‌ సమస్యపై సమీక్షకు పోలీసులను పిలిచానని.. పార్టీ నేతలు కేక్‌ తెచ్చినప్పుడు పోలీసులు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమన్నారు. తమ కుటుంబంపై ఇలాంటి ప్రచారాలు బాధ కలిగిస్తున్నాయని చెప్పారు.

Prathipati Pulla Rao Comment

నేను సమర్థించడం లేదు కానీ.. కొందరు దాన్ని మరో రకంగా చిత్రీకరించారు. బదిలీల్లో జోక్యం, అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాస్తున్నారనడంతో బాధేస్తోంది. నా కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోంది. వారిపై ఇలా బురద జల్లడం సరికాదు. వాస్తవాలు తెలుసుకోకుండా చర్చకు పెట్టి ప్రతిష్ఠను దెబ్బతీయడం బాధాకరం. బదిలీల్లో ఎక్కడైనా నా కుటుంబసభ్యుల జోక్యం ఉంటే నిరూపించాలి. అలా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికే కాదు.. పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని వ్యాఖ్యానించారు.

ఇటీవల ఎమ్మెల్యే సతీమణి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ సమయంలో అక్కడికి కొందరు పోలీసులు వెళ్లారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొన్నారంటూ పల్నాడు జిల్లా ఎస్పీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బర్త్‌డేలో పాల్గొన్న పోలీసులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Also Read : Purandeswari: పార్టీ సిద్ధాంతాలకు అంగీకరిస్తేనే వారిని స్వాగతిస్తాం : పురందేశ్వరి

Leave A Reply

Your Email Id will not be published!