Minister Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొనడం కుట్రపూరితమే – మంత్రి కొల్లు రవీంద్ర

ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొనడం కుట్రపూరితమే - మంత్రి కొల్లు రవీంద్ర

Minister Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర(Minister Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లని కూడా వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొన్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న పడవలు కూడా వైసీపీ నాయకులకు చెందినవి ప్రజలు చెప్తున్నారన్నారు. ప్రకాశం బ్యారేజిని ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు. ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారన్నారు.

బ్యారేజీని ఢీ కొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తుందన్నారు. పడవల మీద వైసీపీ రంగులే ఉన్నాయన్నారు. కుట్రపూరితంగానే జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీకి జరగరాని డామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని… దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. గతంలో వైసీపీ నాయకులు మట్టిని అమ్ముకోబట్టే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గండ్లు వల్లే విజయవాడ నగరం ముంపునకు గురైందని తెలిపారు. గత నాలుగు రోజులుగా అహర్నిశలు పనిచేసి గండ్లను పూడ్చామన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే బుడమేరుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Minister Kollu Ravindra – బోట్లు మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులవేనా ?

ప్రకాశం బ్యారేజీకి బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులకు చెందిన బోట్స్‌ గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు బోట్స్‌కు కలిపి ఒకే గొలుసు వేసి కట్టడంతోనే ఒకే చోటకి వచ్చి ఢీకొన్నాయని… పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఏం జరిగిందంటే ?

ఐదు రోజుల క్రితం కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్‌ వెయింట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్‌ స్వల్పంగా దెబ్బతినగా.. 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్‌ సిమెంట్‌ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీ కొని మరో రెండు బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నంబరు ఖానా వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటూ ఇక్కడ ఇరుక్కుపోయింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ప్రకాశం బ్యారేజ్‌ 67, 69 నెంబర్‌ గేట్లకు మరమ్మతు పనులు పూర్తి చేసారు.

Also Read : Praksham Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు పూర్తయిన మరమ్మతులు !

Leave A Reply

Your Email Id will not be published!