Namo Bharat Rapid Rail: మరిన్ని నమో భారత్ రైళ్లకు పచ్చజెండా ఉపిన ప్రధాని మోదీ
మరిన్ని వందే (నమో) భారత్ రైళ్లకు పచ్చజెండా ఉపిన ప్రధాని మోదీ
Namo Bharat: దేశంలోనే మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. వందే మెట్రో సర్వీస్ పేరును “నమో భారత్ ర్యాపిడ్ రైల్”గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఇవాళ సాయంత్రం భుజ్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ మెట్రో సేవలను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
Namo Bharat Rapid Rail…
దీనీలో భాగంగా దుర్గ్-విశాఖపట్నం,వందేభారత్,నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-నాగ్‌పుర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వందేభారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు తన పట్ల ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read : P Chidambaram: వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అసాధ్యం