Central Cabinet: ఒక దేశం ఒకే ఎన్నికల కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఒక దేశం ఒకే ఎన్నికల కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Central Cabinet: దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌(Central Cabinet) ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 పార్టీలు ప్రముఖ న్యాయమూర్తులు దీనిని సమర్థించారు. 18 రాజ్యాంగ సవరణలను ప్యానల్‌ సిఫార్సు చేసింది.

Central Cabinet Agree..

‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని ప్యానల్‌ పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయతీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల వలస కార్మికులు పలుమార్లు ఓటేయడం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని..దీనివల్ల ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. దానిని నివారించాలంటే జమిలి ఎన్నికలే ఏకైక పరిష్కారమని పేర్కొంది.

ప్రస్తుత ఎన్డీయే సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల స్పష్టంచేశారు. గతనెల స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదోఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనినుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ ఆమోదం.. ఆచరణాత్మకం కాదు:మల్లికార్జున్ ఖర్గే

అయితే కాంగ్రెస్‌తో సహా 15 పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం. దీనిని ప్రజలు అంగీకరించరు అని అన్నారు.

Also Read : Mpox: దేశంలో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదు

Leave A Reply

Your Email Id will not be published!