Hydra Sanga Reddy: చెరువులో భారీ భవన్ని బాంబులతో నేలకూల్చారు

చెరువులో భారీ భవన్ని బాంబులతో నేలకూల్చారు

Hydra: తెలంగాణ రాష్ట్రంలో భూ అక్రమించి అక్రమ నిర్మాణలు పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపుతుంది. ఈ నేపధ్యం లోనే హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని పలు భవనాలను ఇప్పటికే హైడ్రా నేలమట్టం చేసింది. అలాంటి వేళ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కుతుబ్‌శాయి పేట గ్రామంలో అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు.

Hydra in Sanga Reddy…

స్థానిక చెరువులో నాలుగంతస్తుల భవన నిర్మాణంపై చర్యలు చేపట్టారు. అందులోభాగంగా బాంబులతో ఆ భవనాన్ని నేలకూల్చారు. ఈ క్రమంలో బాంబులు పేలి.. భవనం తాలుక శిథిలాలు ఎగిరిపడ్డాయి. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి పుష్కర కాలం క్రితం మల్కాపురం పెద్ద చెరువు పరిధిలో ఈ భవనం నిర్మించారని స్థానికులు వెల్లడించారు. నీళ్లో అడుగు పెట్టుకుండా.. భవనంలోకి వెళ్లేందుకు ఓ మార్గాన్ని సైతం నిర్మించారని వారు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో వారు.. హైదరాబాద్ నగరం నుంచి ఇక్కడి వచ్చి సేద తీరుతారని గ్రామస్తులు వివరించారు.

Also Read : Minister Kollu Ravindra : మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వార్నింగ్ ఇచ్చిన కొల్లు

Leave A Reply

Your Email Id will not be published!