Minister Ram Mohan Naidu : కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన విమానయాన మంత్రి
శ్రీకాకుళంలో మత్స్యకారుల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని రామ్మోహన్ పేర్కొన్నారు...
Ram Mohan Naidu : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఆదివారం భేటీ అయ్యారు. భారత విమానయాన రంగం పురోగతిపై సమీక్షించడంతోపాటు ఎయిర్ పోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై అమిత్ షాతో చర్చించారు. దేశవ్యాప్తంగా కొత్త విమానాశ్రయాలుల అభివృద్ధి, పాత వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ఎన్డీయే సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని రామ్మోహన్(Ram Mohan Naidu) అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. “విమానాశ్రయాల అభివృద్ధికి ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉంది. కేంద్ర బడ్జెట్లో అందుకు తగినట్లే నిధుల కేటాయింపులు జరిపాం. అన్ని రాష్ట్రాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నాం. అమిత్ షాతో కూడా ఇదే అంశంపై చర్చించా. ఎయిర్ పోర్టుల్లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు” అని రామ్మోహన్ పేర్కొన్నారు.
Ram Mohan Naidu Meet..
శ్రీకాకుళంలో మత్స్యకారుల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఏడాదిలో నిర్మించనున్న కొత్త మూలపేట ఓడరేవు స్థానికంగా ఉన్న మత్స్యకారుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కాగా.. ఇటీవల విశాఖ రాయపూర్ (దుర్గు ) వందేభారత్ రైల్‌ను ఈరోజు(సోమవారం) విశాఖ రైల్వేస్టేషన్లో జెండా ఊపి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. సెప్టెంబర్ 20 నుంచి రెగ్యులర్ సర్వీస్‌గా విశాఖ – రాయ్‌పూర్ వందే భారత్ ట్రైన్ తిరుగుతోంది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… విశాఖపట్నం మీదుగా నడిచే నాల్గో వందే భారత్ రైలు ఇదని చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Also Read : PM Modi : న్యూ పూణే మెట్రో సెక్షన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ