Kamala Harris : షాకింగ్ డెసిషన్ తీసుకున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ‘కమలా హరీష్’
ఈఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని కమలా హారిస్ భావించారు...
Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ఓటమిని ఒప్పుకున్నారా? అధ్యక్ష పీఠం అధిరోహించడంలో కీలకంగా వ్యవహరించే ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఆరింటిల్లోనూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌పై విజయం సాధించారు. డోనాల్డ్ ట్రంప్ విజయానికి చేరువవుతున్నందున కమలా హారిస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల రాత్రి ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారని ఆ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ సెడ్రిక్ రిచ్‌మండ్ వాషింగ్టన్‌లో తెలిపారు.
Kamala Harris Comment
ఈఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని కమలా హారిస్ భావించారు. విజయంపై పూర్తి ధీమాతో ఉన్న ఆమె ముందుగానే స్పీచ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ట్రంప్ లీడ్‌లో దూసుకెళుతుండటంతో స్పీచ్‌ను రద్దు చేసుకున్నారు. కమలా హ్యారిస్ గెలుస్తుందనే నమ్మకంతో ముందుగానే వాష్టింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీకి వచ్చిన కమలా మద్దతుదారులు ఆమె ఓడిపోవడంతో కన్నీళ్లతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
Also Read : US Elections 2024 : కమలా హారిస్ గెలుపు కోసం స్వగ్రామంలో తులసేంద్రపురంలో పూజలు