Narendra Modi : అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించనున్న ట్రంప్ కు మోదీ అభినందనలు

భారతప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే...

Narendra Modi : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని మోదీ(Narendra Modi) సోషల్ మీడియాలో స్పందించారు. హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘గతంలో మీ హయాంలో జరిగిన అభివృద్ధి పునాదిగా నేడు మీ విజయం సాకారమైంది. భారత్-అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం, మన సంబంధాలకు పునరుజ్జీవం కల్పించడంపై దృష్టి సారిద్దాం. ఇరు దేశాల ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు, ప్రపంచశాంతి వికాసానికి, స్థిరత్వానికి, శ్రేయస్సు కోసం కలసికట్టుగా పాటుపడదాం’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Narendra Modi Congratulates

భారతప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ‘హౌడీ, మోడీ!’, ‘నమోస్తే మోదీ’ లాంటి కార్యక్రమాల్లో మోదీతో పాటు ట్రంప్ కూడా పాల్గొన్నారు. ట్రంప్ గత పాలనలో భారత్-అమెరికా సంబంధాలు మంచిగానే కొనసాగాయి. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం వంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయని తెలుస్తుంది.

Also Read : Minister Sridhar Babu : టెక్నాలజీ పెరిగి నేటి సమాజంలో సైబర్ దాడులు పెరుగుతున్నాయి

Leave A Reply

Your Email Id will not be published!