YS Sharmila : అదానీ సోలార్ ఒప్పందాలు పై సీబీఐకి ఫిర్యాదు చేసిన షర్మిల

2021లో అదానీ - జగన్‌కు మధ్య సోలార్ పవర్ డీల్ కుదిరిందని స్పష్టమైందన్నారు...

YS Sharmila : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , అదానీల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా(YS Sharmila)రెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల(YS Sharmila) మాట్లాడుతూ.. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికా లో బయట పడిందన్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రూ.1750 కోట్లు లంచం ఇచ్చినట్టు అమెరికాలో ఛార్జ్‌షీట్ ఫైల్ అయిందన్నారు.

YS Sharmila Comments

2021లో అదానీ – జగన్‌కు మధ్య సోలార్ పవర్ డీల్ కుదిరిందని స్పష్టమైందన్నారు. అన్ని ఆధారాలతో చార్జీషీట్ ఫైల్ చేసి ట్రెయిల్ కూడా అమెరికాలో మొదలు పెడుతున్నారన్నారు. మన దేశం, రాష్ట్రాలలో అవినీతి బయట పెట్టే సంస్థలు లేవా అని ప్రశ్నించారు. అదానీ, జగన్ మధ్య కుంభకోణంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించి 1300 పేజీలతో కూడిన సాక్ష్యాలు సమర్పించారని తెలిపారు. ఇప్పుడు నష్టపోయేది అదానీ, జగన్ కాదని… రాష్ట్ర ప్రజలన్నారు. పక్క రాష్ట్రాలలో 1.99 పైసలకే దొరుకుతుంటే జగన్ 2.49 కి కొన్నారని మండిపడ్డారు. ఒకప్పుడు 10 రూపాయలు ఉండే సోలార్ పవర్ ఇప్పుడు 1.99 పైశాలకే దొరుకుతోందన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ధర తగ్గే అవకాశం ఉందన్నారు.

అయినా25 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలిసే ఓడించి కూటమిని ఎన్నుకున్నారన్నారు. కూటమి నేతలు అదానిని కాపాడటంపై దృష్టి సారిస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో అదానీ స్కాంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చకు తెచ్చారన్నారు. ఏసీబీ పారదర్శకంగా అదానీ సోలార్ పవర్‌పై దర్యాప్తు చేయాలని కోరారు. ప్రజల కోసం పని చేసే ఏసీబీని స్వేచ్చగా పనిచేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించాలని వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.

Also Read : CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ మొదలు పెట్టిన తెలంగాణ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!