Minister Bandi Sanjay : అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన కేంద్రమంత్రి

శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంతోపాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారని చెప్పారు...

Bandi Sanjay : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంధ్యా ధియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని అన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంతోపాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారని చెప్పారు. సమస్య ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటని బండి సంజయ్ కుమార్ అన్నారు.

Minister Bandi Sanjay Comments

ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందని విమర్శించారు. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తుంటే ఏనాడైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా అని నిలదీశారు. మీకో న్యాయం…. ఇతరులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని హితవు పలికారు. లేనిపక్షంలో బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :PM Modi : స్పిన్ బౌలర్ అశ్విన్ కు ప్రధాని మోదీ సలహా..

Leave A Reply

Your Email Id will not be published!