CM Revanth Reddy : నేడు 4 కీలక పథకాలు అమలు చేయనున్న తెలంగాణ సర్కార్

లబ్ధిదారుల వివరాలు కొలిక్కి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది...

CM Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న నాలుగు కీలక పథకాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను సర్కారు ప్రారంభించబోతోంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ప్రభుత్వం పలు రకాలుగా కసరత్తు చేసింది. విధి విధానాల రూపకల్పన మొదలుకొని.. దరఖాస్తుల స్వీకరణ, గ్రామసభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక వంటి ప్రక్రియలు చేపట్టింది.

కానీ, లబ్ధిదారుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. పథకాలను మాత్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శనివారం పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క(Bhatti Vikramarka), నాలుగు పథకాలకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం భట్టి(Bhatti Vikramarka), ముగ్గురు మంత్రులు సమావేశ నిర్ణయాలను సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నాలుగు పథకాలను మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

CM Revanth Reddy Comment

లబ్ధిదారుల వివరాలు కొలిక్కి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు పథకాలకు సంబంధించి ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నాయి. దరఖాస్తుల ఖరారు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున.. ముందుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలో నాలుగు పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.అంటే.. ఆ గ్రామంలో నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులు ఎంత మంది ఉంటే అంత మందికీ మంజూ రు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 622 రెవె న్యూ మండలాలు ఉన్నాయి.

వీటిలో మండలానికి ఒక గ్రామం చొప్పున 622 గ్రామాల్లో రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు కానున్నాయి. కానీ, హైదరాబాద్‌లోని మండలాలకు రైతు భరోసా, ఇందిర ఆత్మీయ భరోసా పథకాల ఆవశ్యకత లేనందున.. మిగతా జిల్లాల్లో ఉన్న 606 మండలాల్లోని 606 గ్రామాల్లో మొత్తం నాలుగు పథకాలను అ మ లు చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy).. నారాయణపే ట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలను ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మంజూరు పత్రాలను అందజేస్తారు. రేషన్‌ కార్డులు కూడా ఇస్తారు.

నగదు బదిలీతో కూడిన రైతు భరోసా, ఇందిర ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 26న ఆదివారం బ్యాంకులకు సెలవు ఉన్నందున.. రాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సొమ్ము జమ అ వుతుందని అధికార వర్గాలు వివరించాయి. అయి తే.. రైతు భరోసా పథకం కింద సొమ్మును గతంలోని రైతుబంధు పథకం మాదిరిగానే.. ముందుగా ఎకరం భూమి ఉన్నవారికి, తర్వాత రెండెకరాల వారికి, మూడెకరాల వారికి, నాలుగెకరాల వారికి.. వరుసగా బ్యాంకు ఖాతాల్లో వేస్తా రు. ఇలా కోటి 40 లక్షల ఎకరాలకు ఈ స్కీము వర్తించే అవకాశాలున్నట్లు ప్రాథమికంగా తేల్చా రు.

ఆత్మీయ భరోసా పథకం కింద కూడా సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. నాలుగు పథకాలకు సంబంధించి మిగతా గ్రామాల లబ్ధిదారుల సంఖ్యను తేల్చడానికి ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం నాటికి రాష్ట్రంలోని ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా పూర్తవుతుంది. ఈ జాబితాలను పరిశీలించి, అమలు కార్యాచరణ ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. ఏ పథకానికి ఎప్పుడెప్పు డు ఆర్థిక సాయం అందించాలన్న దానిపై నిర్ణ యం తీసుకుంటారు. ఈ ప్రక్రియను మార్చి 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : PM Narendra Modi : పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని అభినందనలు

Leave A Reply

Your Email Id will not be published!