PM Narendra Modi : మహా కుంభమేళా త్రివేణి సంఘం ఘాట్ కు ప్రధాని
అరయిల్ ఘాట్ నుంచి పడవ ద్వారా సంగం ఘాట్ చేరారు...
Narendra Modi : ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ఉత్సవాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అరయిల్ ఘాట్ నుంచి సంగం ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమ స్థలానికి చేరుకోవడానికి మోదీ(Narendra Modi), సీఎం యోగి కలిసి పడవ ఎక్కారు. అరయిల్ ఘాట్ నుంచి పడవ ద్వారా సంగం ఘాట్ చేరారు. ఆ సమయంలో ప్రధానమంత్రి మహాకుంభమేళా ప్రాంతం గురించి ముఖ్యమంత్రి యోగి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆపై పవిత్ర స్నానం చేశారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు.
PM Narendra Modi Visit
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంగం ఘాట్‌కు చేరుకున్న వెంటనే, మోదీ మోదీ అంటూ ప్రజల నినాదాలు మార్మోగాయి. మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్‌లో 2.30 గంటలు బస చేస్తారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఈరోజు బడే హనుమాన్ జీ, అక్షయవత్‌లను కూడా సందర్శించవచ్చని చెబుతున్నారు. దీనికి ముందు కూడా ప్రధాని మోదీ 6 సంవత్సరాల క్రితం సంగంలో స్నానం చేశారు. 2019 కుంభమేళాలో ప్రధాని మోదీ పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగారు. అదే సమయంలో మహా కుంభమేళా ప్రారంభానికి ముందు, డిసెంబర్ 13న, ప్రధాని మోదీ కూడా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి అనేక పథకాలను ప్రారంభించారు.
Also Read : America Sends : 205 మంది భారతీయుల గెంటివేత.. ల్యాండ్ అయిన ఆర్మీ ఫ్లైట్