Supreme Court of India : కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కెనరా బ్యాంకు ఉద్యోగి పదవీ విరమణ కంటే ముందు 2001లో మరణించగా....
Supreme Court of India : కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు(Supreme Court of India) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టమనుకునే వాళ్లకే కారుణ్య నియామకం కింద వారసులకు కొలువు ఇవ్వాలని పేర్కొంది. అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడే కుటుంబాల వారికే ఉద్యోగం ఇవ్వాలని వ్యాఖ్యానించింది. అంతే తప్ప మరణించిన ఉద్యోగి కుటుంబ జీవన ప్రమాణాలు పడిపోతాయన్న కారణంతో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగి సంపాదనతోనే కుటుంబం మొత్తం నడుస్తున్న పరిస్థితుల్లో.. ఆ ఉద్యోగి మరణిస్తే, అతని/ఆమె కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగం ఇవ్వాలన్నది ‘కారుణ్య నియామకం’ ఉద్దేశమని వివరించింది.
Supreme Court of India Comment
కెనరా బ్యాంకు ఉద్యోగి పదవీ విరమణ కంటే ముందు 2001లో మరణించగా.. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయన కుమారుడు అజిత్‌కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు ఉన్నతాధికారి తిరస్కరించారు. దాన్ని సవాలు చేస్తూ అజిత్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు 2నెలల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, పరిహారంగా రూ.5 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై బ్యాంకు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
Also Read : AP & TG Bird Flu Effect : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో భారీగా పడిపోయిన చికెన్ ధరలు