PM Modi Visited : ఒక్క రోజులో 3 రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోదీ

అక్కడ ఆయన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025ను ప్రారంభించారు...

PM Modi : ప్రధాని మోదీ వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సోమవారం ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించారు ప్రధాని మోదీ. ఉదయం మధ్యప్రదేశ్.. మధ్యాహ్నం బీహార్‌లో.. ఈవెనింగ్ అస్సాంలో పర్యటించారు. ప్రధాని మోదీ ముందుగా మధ్యప్రదేశ్ చేరుకొని.. అక్కడ ఆయన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025ను ప్రారంభించారు. ఆ తర్వాత బీహార్, అస్సాం(Assam)లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌లో అల్పాహారం, బీహార్‌(Bihar)లో మధ్యాహ్న భోజనం, అస్సాంలో రాత్రి డిన్నర్ చేశారు ప్రధాని మోదీ.

PM Modi Visit 3 States in a single day

మధ్యప్రదేశ్‌లో GIS-2025 ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడారు. గత 2 దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకేస్తోందన్నారు. మధ్యప్రదేశ్(Madya Pradesh) ప్రజల మద్దతుతో, ఇక్కడి బీజేపీ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించిందని కొనియాడారు. రెండు దశాబ్దాల క్రితం వరకు, మధ్యప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికే ప్రముఖ కంపెనీలు భయపడ్డాయి. అయితే ఇవాళ ఈ రాష్ట్రమే పెట్టుబడుల విషయంలో దేశంలోని అగ్ర రాష్ట్రాల జాబితాలో చేరిందన్నారు ప్రధాని మోదీ. అలాగే భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలకమైన వస్త్ర, పర్యాటక, సాంకేతికత రంగాల్లో సుమారు కోట్లాది కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.

ఈ సమ్మిట్ అనంతరం బీహార్‌లో పర్యటించారు ప్రధాని మోదీ. కిసాన్ సమ్మాన్ సమరోహ్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అలాగే, కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బును విడుదల చేశారు. అనంతరం పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులకు వ్యవసాయానికి మంచి విత్తనాలు, తగినంత చౌకైన ఎరువులు, నీటిపారుదల సౌకర్యాలు, వ్యాధుల నుంచి జంతువుల రక్షణ.. విపత్తుల సమయంలో నష్టాల నుంచి రక్షణ అవసరమని ప్రధాని మోదీ అన్నారు. గతంలో రైతులు ఈ అంశాలన్నింటికీ సంబంధించిన సమస్యలతో సతమతమయ్యారని.. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పరిస్థితులను మార్చిందన్నారు. ఇక అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ.. గౌహతిలో ఝుమోయిర్ బినందిని కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సాం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తన కోసం తరలించి వచ్చిన ప్రజలు.. తనకెంతో శక్తిని ఇచ్చారని.. ఇవాళ ఈ కార్యక్రమంలో ఉత్సాహం, ఆనందం ప్రతిధ్వనిస్తోందన్నారు.

Also Read : YS Jagan : అధికారం ఉన్నప్పుడు పదవులిచ్చాం ఎప్పుడు కృతజ్ఞతగా పనిచేయండి

Leave A Reply

Your Email Id will not be published!