Indian Railways: అత్యంత శక్తివంతమైన ఇంజన్ ను సిద్ధం చేసిన ఇండియన్ రైల్వే !

అత్యంత శక్తివంతమైన ఇంజన్ ను సిద్ధం చేసిన ఇండియన్ రైల్వే !

Indian Railways : భారతదేశం ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర రైల్వే శాఖది. అటు ప్రయాణికులను, ఇటు సరకు రవాణాలోనూ భారతీయ రైల్వే రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే(Indian Railways) ఎప్పటికప్పుడు తన శక్తిని పెంచుకుంటూ అటు ప్రయాణికులకు ఇటు సరకు రవాణాలోనూ వినూత్న సేవలతో అందిస్తోంది. ఇప్పటికే గరీభ్ రథ్, దురంతో, శతాబ్ధి, డబుల్ డెక్కర్, వందే భారత్ వంటి సేవలతో దూసుకుపోతున్న భారతీయ రైల్వే…. తాజాగా 9000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను రూపొందించింది.

Indian Railways New Engine

‘మేక్ ఇన్ ఇండియా’ ధ్యేయంలో భాగంగా గుజరాత్‌ లోని దాహోద్ ఫ్యాక్టరీలో ఈ ఇంజన్ ను తయారు చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఈ ఇంజిన్ తయారు చేసిన ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ ఇంజిన్ వచ్చే నెలలో ట్రాక్‌లపై పరుగులు తీయనున్నదని సమాచారం. ఈ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ ను తయారు చేసిన గుజరాత్‌ లోని దాహోద్ ఫ్యాక్టరీకి 2022లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్లలో ఈ కర్మాగారం దేశంలోనే అత్యంత శక్తివంతమైన రైలు ఇంజిన్‌ను నిర్మించి, ట్రాక్‌పైకి తీసుకువచ్చింది.

భారతీయ రైల్వే(Indian Railways) ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ లను 6000 హార్స్‌పవర్ నుండి 9000 హార్స్‌పవర్‌ కు అప్‌ గ్రేడ్ చేస్తోంది. ఇంజినీరింగ్ కంపెనీ సీమెన్స్ గుజరాత్‌ లోని దాహోద్‌ లో రూ.20,000 కోట్ల ఖరీదు చేసే 9,000 హార్స్ పవర్ కలిగిన 1,200 ఎలక్ట్రిక్ ఇంజిన్‌లను తయారు చేయనుంది. 9000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఈ ఇంజిన్ 4,500 టన్నుల సరుకును మోసుకెళ్లే గూడ్స్ రైలును అధిక వేగంతో నడుపుతుంది. ఒక సాధారణ ట్రక్కు 7 నుండి 10 టన్నుల వస్తువులను మాత్రమే తీసుకువెళుతుంది. ఈ నూతన ఇంజిన్లతో రైళ్ల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు పెరగనుంది.

Also Read : Sonu Sood: చెఫ్‌ అవతారం ఎత్తిన సోనూసూద్‌ ! రెట్టింపు రేటుకు దోశ ?

Leave A Reply

Your Email Id will not be published!