PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ !
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ !
PV Sunil Kumar : సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారనే అభియోగంపై సునీల్ కుమార్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపి, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేయడంలో సునీల్ కుమార్(PV Sunil Kumar) కీలక పాత్ర పోషించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అప్పటి సిఐడీ అధికారులపై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు.
PV Sunil Kumar Suspension
అయితే ఈ కేసులో ఇంతవరకు అప్పటి సిఐడీ చీఫ్ సునీల్ కుమార్(PV Sunil Kumar) పై మాత్రం ఎటువంటి చర్యలు లేదు. ఈ నేపథ్యంలో 2020 నుంచి 2024 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్ పలుమార్లు విదేశాలకు వెళ్లి ఆలిండియా సర్వీసు నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీ నివేదిక ఆధారంగా సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
సీఐడీ మాజీ డీజీగా ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం.. అదే విధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ఫ్లానింగ్‌కు విరుద్ధంగా విదేశాల్లో ఉండడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ణారణకావడంతో సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సునీల్ కుమార్‌పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసాపురం ఎంపీ, ప్రసుత్త డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కూడా ధృవీకరించింది. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read : Indian Railways: అత్యంత శక్తివంతమైన ఇంజన్ ను సిద్ధం చేసిన ఇండియన్ రైల్వే !