Actress Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి అరెస్ట్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి అరెస్ట్
Ranya Rao : ప్రముఖ కన్నడ నటి రాన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయింది. దుబాయ్ నుండి భారత్ కు అక్రమంగా బంగారం తరలిస్తుందన్న సమాచారం మేరకు నటి రాన్యారావు(Ranya Rao)పై డీఆర్‌ఐ అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానంతో ఆమెను అధికారులు చెక్ చేయగా, స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, కన్నడలో సుదీప్‌తో మాణిక్య సినిమాలో రాన్యా నటించింది.
Actress Ranya Rao Arrest
బంగారాన్ని అక్రమంగాతరలిస్తున్న ఆరోపణలపై సోమవారం అర్ధరాత్రి ఆమెను అరెస్టు చేశామని పోలీసులు ధ్రువీకరించారు. ఐపీఎస్ అధికారి రామచంద్రరావుకు సమీప బంధువైన ఆమె కన్నడలో మాణిక్య, పటాకి, తమిళంలో వాఘా సినిమాల్లో నటించారు. పక్షం రోజుల్లో ఆమె నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లి 15 కిలోల వరకు బంగారు బిస్కెట్లను తీసుకువచ్చిందని ప్రాథమిక విచారణలో గుర్తించారు. బంగారాన్ని జప్తు చేసుకుని కస్టమ్స్ అధికారులతో కలిసి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఠాణా పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులను దారి తప్పించేందుకు ఈసారి దిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చి దొరికిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాన్యారావును డీఆర్‌ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులకు తాను డీజీపీ కూతురినంటూ రన్యారావు చెప్పినట్లు సమాచారం. తరచుగా దుబాయ్ వెళ్లే రన్యారావు.. ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది.
Also Read : DK Shivakumar: కన్నడ రాజకీయాల్లో ఆశక్తి రేపుతోన్న ఖర్గే, డీకేల భేటీ