Jai Shankar: విదేశాంగ మంత్రి జైశంకర్ కార్యక్రమంలో ఖలిస్థాన్ నినాదాలు
విదేశాంగ మంత్రి జైశంకర్ కార్యక్రమంలో ఖలిస్థాన్ నినాదాలు
Jai Shankar : బిట్రిష్ రాజధాని లండన్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jai Shankar) పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఖలిస్తానీ అనుకూల వాదులు అత్యుత్సహం ప్రదర్శించారు. లండన్ పర్యటనలో ఉన్న జైశంకర్… చాథమ్ హౌస్ లో యుకె విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో చర్చలు జరుపుతున్న సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూల వాదులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో వార భద్రతా బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. దీనితో అప్రమత్తమైన బ్రిటన్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భారత్ కు వ్యతిరేకంగా, ఖలిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలిస్తూ బారికేడ్లకు అవతల ఉన్న మిగతా ఆందోళనకారులను అక్కడినుంచి తరిమికొట్టారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖలిస్తాన్‌కు కఠినమైన సూచనలు జారీ చేసింది.
S Jai Shankar…
బ్రిటిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంఘటనను ఖండిస్తూ ‘ఇటువంటి బెదిరింపు చర్యలను మేము తిరస్కరిస్తున్నామని పేర్కొంది. మెట్రోపాలిటన్ పోలీసులు వెంటనే పరిస్థితిని చక్కదిద్దారని కూడా తెలిపారు. ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ తాత్కాలిక రాయబారిని ఎంఈఏకి పిలిపించి తీవ్ర నిరసన తెలిపే లేఖను అందజేసింది. మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిన్న వేర్పాటువాద, తీవ్రవాద సమూహం రెచ్చగొట్టే కార్యకలాపాలను మేము ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి అంశాలు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయని, ఆతిథ్య దేశం తన దౌత్య బాధ్యతలను నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో భారతదేశం, బ్రిటన్ మధ్య సంబంధాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. దీంతోపాటు అక్కడి భద్రతా వ్యవస్థలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడుతూ… ‘ప్రపంచంలో భారత్ ఎదుగుదల, పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శక్తిమంతమైన దేశాలకు సమానాధికారాలు ఉండే విధానం దిశగా ట్రంప్ సాగుతున్నారని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతను తమ రెండు దేశాలూ గుర్తించాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న భిన్నధ్రువ ప్రపంచ తీరు భారత్ ప్రయోజనాలకు సరిపోలుతుందని పేర్కొన్నారు.
Also Read : Nara Bhuvaneswari: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు నారా భువనేశ్వరి భూమి పూజ