Nagam Janardhan Reddy: పాలమూరు-రంగారెడ్డిపై మాజీ మంత్రి నాగం సుప్రీంకోర్టులో పిటిషన్‌

పాలమూరు-రంగారెడ్డిపై మాజీ మంత్రి నాగం సుప్రీంకోర్టులో పిటిషన్‌

Nagam Janardhan Reddy : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని… స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది డిసెంబరులో బీహెచ్‌ఈఎల్‌ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎత్తిపోతల పథకానికి సంబంధించి సరఫరా చేసిన యంత్రాలు, తమకు వచ్చిన బిల్లుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొంది. బీహెచ్‌ఈఎల్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాలు తాము చేసిన ఆరోపణలను నిజం చేస్తున్నాయని నాగం తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ టెండర్‌ లో మూడో వంతు కూడా బీహెచ్‌ఈఎల్‌ కు చెల్లించలేదని అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

Nagam Janardhan Reddy Approach

బీహెచ్‌ఈఎల్‌ దాఖలు చేసిన అఫిడవిట్, దానికి నాగం జనార్దన్‌ ఫైల్ చేసిన రిజాయిండర్‌ లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో మూడు పిటిషన్లు కొట్టివేశారని, మరికొన్ని పెండింగ్‌ లో ఉన్నాయని మేఘా సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తున్నందున వెంటనే దర్యాప్తునకు ఆదేశించాలని నాగం తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని కోరారు. సవివరంగా వాదనలు విన్న తరువాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 13 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.

Also Read : Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయానికి త్వరలో స్వయంప్రతిపత్తి

Leave A Reply

Your Email Id will not be published!