Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
Somu Veerraju : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు(Somu Veerraju)ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. మొత్తం ఐదు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా…. అందులో ఒకటి జనసేనకు కేటాయించింది. టీడీపీ అధిష్టానం తమ పార్టీ తరపున బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్, కావలి గ్రీష్మ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఒక స్థానాన్ని టీడీపీ అధిష్టానం కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీకు కేటాయించింది. ఇప్పటికే జనసేన నుండి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా… సోమవారం మిగిలిన నలుగురు నామినేషన్లు దాఖలు చేసారు.
Somu Veerraju – రాష్ట్ర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా సోము వీర్రాజు
కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటానని, రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలి కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించిన అనంతరం సోము మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ నేతలు బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ దఫాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయేకు అన్ని స్థానాలూ గెలుచుకునే అవకాశముంది. వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్.. ఎస్సీ సామాజికవర్గం కావలి గ్రీష్మకు తెదేపా అవకాశం కల్పించింది. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా బీజేపీ నుండి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేసారు.
Also Read : New Airports: ఏపీకు రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు