Ex Minister Sriramulu: మైసూరు రాజుల భూమిపై రాజకీయం సరికాదు – మాజీ మంత్రి శ్రీరాములు
మైసూరు రాజుల భూమిపై రాజకీయం సరికాదు - మాజీ మంత్రి శ్రీరాములు
Sriramulu : మైసూరు రాజుల కాలం నాటి హరెమనె స్థలం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడంం సరి కాదని మాజీ మంత్రి, బీజేపీ నాయకులు బి. శ్రీరాములు(Sriramulu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బళ్లారిలో శ్రీరాములు నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో మైసూరు రాజులంటే ప్రత్యేక అభిమానముందని, అది రాజుల కాలం నుంచి వచ్చిన ప్రతిష్ట, అలాంటి మైసూరు రాజులకు చెందిన స్థలం విషయంలో కాంగ్రెస్ పార్టీ దురుద్దేశంతో లాక్కోవాలని చూస్తుందని ఆరోపించారు.
Ex Minister Sriramulu Comment
మైసూరు రాజ వంశస్తుడైన యధువీర్ బీజేపీ ఎంపీ కావడంతో ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. రాజుల కాలంనాటి స్థలాన్ని వివాదంలోకి లాగడం సరికాదన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నా లాక్కోవాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో గ్యారెంటీ పథకాల పరిశీలనకు కమిటీ వేసి అందులో రూ.300 కోట్లు నిధులు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే బళ్లారి గడిగె చెన్నమ్మ సర్కిల్ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఒక మోడల్ గా తయారు చేయాలనుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని రూపలేకలు మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేశారని ఆరోపించారు. లెబనార్ దేశంలో పెన్సిల్ తరహాలో ఉండే స్తూపం ఆధారంగా ఇక్కడ అలా చేయాలని చూస్తే, దాని రూపు రేఖలు మార్చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో గడిగె చెన్నప్ప సర్కిల్‌ను తీర్చిదిద్దుతామన్నారు.
Also Read : Liquor Scam: తమిళనాడులో వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం!