India: ట్రైన్ హైజాక్ పై పాక్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్
ట్రైన్ హైజాక్ పై పాక్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్
India : ఇటీవల పాకిస్తాన్ లోని సుమారు 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) వేర్పాటువాదులు బోలన్ ప్రాంతంలో మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ప్రయాణీకులను రక్షించేందుకు ట్రైన్ హైజాక్ ఆపరేషన్ చేపట్టిన పాకిస్తాన్ మొత్తం 33 మంది బలూచ్ మిలిటెంట్లను కాల్చి చంపింది. బలూచ్ మిలిటెంట్లకు, పాక్ సైన్యానికి జరిగిన భీకర పోరులో నలుగురు సైనికులతో పాటు మరో 21 మంది ప్రయాణీకులు మృతి చెందించనట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. అయితే బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయడంలో, వారిని రెచ్చగొట్టడంతో భారత్ పాత్ర ఉందంటూ పాకిస్థాన్ సంచలన ఆరోపణలు చేసింది. భారత్ పొరుగుదేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది.
India Strongly Reatcs
ఈ విషయంపై భారత(India) విదేశాంగ శాఖ స్పందిస్తూ… పాక్(Pakistan) చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వారు ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
బలోచిస్థాన్‌లో జరిగిన రైలు హైజాక్ ఘటనపై పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్ అలీఖాన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. పొరుగుదేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తూ, ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందని అన్నారు. గతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఏ అఘాయిత్యానికి పాల్పడినా భారత్ వైపు చూపించేవారని, ఇప్పుడు పాక్ విదేశీ విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు షఫ్‌ఖత్ అలీఖాన్ ఈవిధంగా స్పందించారు. పాక్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. ‘‘భారత మీడియా ఒకవిధంగా బీఎల్‌ఏను కీర్తిస్తోంది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ఆ దేశ విధానాన్ని ప్రతిబింబిస్తోంది’’ అని పేర్కొన్నారు.
ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకోవాలి: అఫ్గానిస్థాన్
రైలు హైజాక్ వెనక అఫ్గానిస్థాన్ హస్తం ఉందనేందుకు తమవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. పాక్ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. పాక్ బాధ్యతారహిత వ్యాఖ్యలు వారి దిగజారుడు విధానాలకు నిదర్శనమని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోలేని పాక్ ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికింది.
Also Read : Ex Minister Sriramulu: మైసూరు రాజుల భూమిపై రాజకీయం సరికాదు – మాజీ మంత్రి శ్రీరాములు