Minister Seethakka: తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారికి మంత్రి సీతక్క మాస్ వార్నింగ్
తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారికి మంత్రి సీతక్క మాస్ వార్నింగ్
Seethakka : సోషల్ మీడియా ఎఫెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం అందరికీ చాలా రిలీఫ్ గా ఉందని మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ బారిన పడ్డ మహిళనే అన్నారు. ‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి… మానసిక ఆవేదనకు గురి చేశారు. కొన్ని సోషల్ మీడియా పోస్ట్ లు కొన్ని సార్లు నన్ను డీమోరల్ చేశాయి. సోషల్ మీడియా వల్ల తాను కుమిలిపోయానని, దాన్ని కట్టడించడం చాలా అవసరమని అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టం... అలాంటిది మేము ఈ స్థాయికి వస్తే మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. సోషల్ మీడియాను సోషల్ సర్వీస్ కోసం వాడుకున్న నేను… అంతే ఇబ్బందులకు గురయ్యాను.
Minister Seethakka Slams
సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్ధాలకు వాడుతుంది. సోషల్ మీడియా కుటుంబాలను బజారుకీడుస్తుంది. బాడీ షేమింగ్, ఫోటోలు మార్ఫింగ్, అననివి అన్నట్లుగా చెప్తున్నారు. గత ఏడాది నుంచి ఇది ఎక్కువ అవుతుంది. అన్న చెల్లెల్లు చేతిలో చెయ్యి వేసుకున్నా… మరోకరకంగా చూపుతున్నారు. సోషల్ మీడియాను మంచికి వాడాలి… చెడు కు కాదు. కరోనా సమయంలో ఎంతో సర్విస్ చేసా… దాన్ని కూడా సోషల్ మీడియాలో నన్ను విమర్శించారు. అబద్దాల పైనే బీఆర్ఎస్ నడుస్తుంది. అబద్ధానికి అర్థం బీఆర్ఎస్. ఏ రోజుకైనా నిజమే గెలుస్తుంది. సోషల్ మీడియా కట్టడి అవసరం. సోషల్ మీడియా ద్వారా మాపై బురద చల్లుతున్నారు….కడుక్కోవడం మా వంతు అవుతుంది’ అని సీతక్క(Seethakka) వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇలాంటి భాషా ప్రయోగాన్ని తెలంగాణలో ఎప్పుడూ చూడలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. నోటికి వచ్చింది మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహించారు రేవంత్ రెడ్డి. జర్నలిస్టులకు సైతం విధివిధానాలు రూపొందిస్తామని, అవసరమైతే ప్రత్యేక చట్టాలు తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు ఆత్మగౌరవం చంపుకుని దిగజారుడు రాజకీయాలు చేయరంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ లేదని, భవిష్యత్ లో ఇలాగే తప్పుగా మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Also Read : MLA Raja Singh: అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్