Odisha Former MP: కులాంతర వివాహం చేసుకున్నందుకు మాజీ ఎంపీకు పన్నెండేళ్లు కుల బహిష్కరణ

కులాంతర వివాహం చేసుకున్నందుకు మాజీ ఎంపీకు పన్నెండేళ్లు కుల బహిష్కరణ

Odisha Former MP : అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలో కూడా కులాల మధ్య అంతరం తగ్గడం లేదు. గతంతో పోలిస్తే ఈ దశాబ్దంలో ప్రేమ పేరుతో కులాంతర వివాహాల సంఖ్య పెరిగినప్పటికీ… ఇప్పటికీ కూడా అక్కడక్కడా పరువు హత్యలు, కుల బహిష్కరణలు తప్పడం లేదు. ఆర్ధికంగా, సామాజికంగా సమాజంలో మెరుగైన స్థానంలో ఉన్న తల్లిదండ్రులు పరువు హత్యలకు పాల్పడితే… గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వారు పరువు పేరుతో కుల బహిష్కరణలు విధిస్తున్నారు. అయితే ఇలాంటి కుల బహిష్కరణ సాక్ష్యాత్తూ మాజీ ఎంపీకు కూడా తప్పలేదు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన ఎన్నికల సమయంలో అణగారిన వర్గాలతో కలిసి సామూహిక భోజనాలు చేసే రాజకీయ నాయకులకు… కుల బహిష్కరణ తప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక పూర్తి వివరాల్లోకి వెళితే…

Odisha Former MP Expelled from his Caste

ప్రేమించిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకొన్నందుకు ఒడిశాలోని ఓ మాజీ ఎంపీకి సామాజిక బహిష్కరణ తప్పలేదు. గిరిజనేతర మహిళను పెళ్లాడారన్న కారణంగా ఒడిశాలోని నబరంగ్‌పుర్‌ మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్‌ మాఝీ(Pradep Kumar Majhi) కుటుంబాన్ని గిరిజన భాత్ర సమాజ్‌ కేంద్ర కమిటీ 12 ఏళ్లపాటు సంఘం నుంచి బహిష్కరించింది. ప్రదీప్‌ మాఝీ కేంద్రపడా జిల్లాకు చెందిన సంగీతా సాహును మార్చి 12న గోవాలో పెళ్లాడారు. గిరిజనుడైన ప్రదీప్‌ మాఝీ గిరిజనేతర మహిళను పెళ్లి చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించినట్లు కమిటీ అధ్యక్షుడు టికాచంద్‌ తెలిపారు. దీనిపై ప్రదీప్‌ సోదరుడు ప్రసన్న మాట్లాడుతూ… తమ కుటుంబంపై బహిష్కరణ వేటు గురించి మీడియా ద్వారా మాత్రమే తెలిసిందన్నారు. తీర్పునకు కట్టుబడి ఉంటామని, కమిటీ సభ్యులతో మాట్లాడతామని తెలిపారు.

Also Read : Minister Ashwini Vaishnaw: తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆశక్తికరమైన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!