Airasia Flight: ఎయిర్‌ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ! శంషాబాద్‌ లో ఎమర్జెనీ ల్యాండింగ్‌ !

ఎయిర్‌ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ! శంషాబాద్‌ లో ఎమర్జెనీ ల్యాండింగ్‌ !

Airasia : కౌలాలంపూర్‌ ఎయిర్‌ ఏషియా విమానంకు తృటిలో ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో ఎమర్జెనీ ల్యాండింగ్‌ చేసారు. ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చిన పైలట్… వారి సూచనలతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన సమయంలో దానిలో 73 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. దీనితో ఎయిర్ ఏషియా(Airasia) యాజమాన్యంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Airasia Flight Emergency Landing

వారం క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులు ఫైట్ ల్యాండింగ్‌ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించారు. ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావటంతో… పైలట్ విమానాన్ని డౌన్‌ చేశాడు. అయితే అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌ తీసుకోవడానికి మరో విమానం రెడీగా ఉండగా… దాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని గాల్లోకి లేపాడు. దీనితో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : Harish Rao: కేసీఆర్‌ కు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి – హరీశ్‌రావు డిమాండ్

Leave A Reply

Your Email Id will not be published!