Karnataka Government: ప్రజాప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేసిన కర్ణాటక సర్కార్
ప్రజాప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేసిన కర్ణాటక సర్కార్
Karnataka Government : పెరిగిన ధరలకు అనుకూలంగా ప్రభుత్వాలు సాధారణ ఉద్యోగుల జీత భత్యాలు పెంచడం మాట ఏమో గాని… ప్రజాప్రతినిధుల వేతనాలు మాత్రం పెంచుకునే వెసులు బాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) మాట్లాడుతూ… ప్రస్తుతం పెరిగిన ధరల భారంతో సామాన్య ప్రజల్లాగే ప్రజా ప్రతినిధులూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుచేత సీఎం వేతనం నెలకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు, మంత్రుల వేతనాలు రూ.60 వేల నుంచి రూ.1.25 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
Karnataka Government Hike
ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో సీఎం, మంత్రులు, శాసనసభ్యుల వేతనాలు 100 శాతం పెంపు ప్రతిపాదనకు శాసనసభ ఆమోదం తెలిపింది. వేతనాల పెంపును హోంమంత్రి జి.పరమేశ్వర సమర్థించుకున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల భారంతో సామాన్య ప్రజల్లాగే ప్రజా ప్రతినిధులూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం వేతనం నెలకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు, మంత్రుల వేతనాలు రూ.60 వేల నుంచి రూ.1.25 లక్షలకు పెరిగాయి. మరోవైపు… ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు భారీగా వేతనాల పెంపు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read : Donald Trump: ట్రంప్ సొంత నిధులతో సునీతా విలియమ్స్ ఓవర్ టైమ్ జీతం