Karnataka Honeytrap: కర్ణాటక హనీట్రాప్ పై సుప్రీంలో పిల్‌

కర్ణాటక హనీట్రాప్ పై సుప్రీంలో పిల్‌

Karnataka Honeytrap : కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోన్న హనీ ట్రాప్‌ వ్యవహారం… సుప్రీకోర్టును తాకింది. కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, కేంద్ర నాయకులపై జరిగిన హనీట్రాప్‌ కేసుపై స్వతంత్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ నివాసి వినయ్‌కుమార్‌ దీన్ని దాఖలు చేశారు. తనపై హనీట్రాప్‌ జరిగిందని కర్ణాటక మంత్రి రాజణ్ణ(Minister Rajanna) శాసనసభలో స్వయంగా ప్రస్తావించడం, మీడియాలో వచ్చిన కథనాలను ఉటంకించారు. దీనిని అత్యవసరమైనదిగా భావించి, విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్‌ ఖన్నా ధర్మాసనం ఒకట్రెండు రోజుల్లోనే విచారణ చేపడతామని తెలిపింది.

Karnataka Honeytrap Case

కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్‌(Karnataka Honeytrap) బాధితులుగా ఉన్నారంటూ కర్ణాటక మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాశంమైన సంగతి తెలిసిందే. ఇందులో అధికార, విపక్ష సభ్యులతో పాటు జాతీయ స్థాయిలోని నాయకులు కూడా ఉన్నారంటూ ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటాంచారు. అంతేకాదు దీనికి సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నారన్నారు. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్‌ జార్కిహోళీ మాట్లాడుతూ.. ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్‌ యత్నం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ… బీజేపీ మాత్రం ఈ వలపు వల వెనుక కాంగ్రెస్‌ ప్రభుత్వ హస్తమే ఉందని, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీకోర్టులో పిల్ దాఖలు కావడం… రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మ బదిలీకు కొలీజియం నిర్ణయం

Leave A Reply

Your Email Id will not be published!