Paper Leakage: 10th పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

Paper Leakage : పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని… తన డిబార్‌ ను రద్దు చేసి పరీక్షలు రాజే అవకాశం కల్పించాలని కోరుతూ నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన విద్యార్థిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా విద్యార్థిని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం… ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

10th Paper Leakage Viral

ఈనెల 21న నకిరేకల్‌లో టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్(Paper Leakage) ఘటన తీవ్ర కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలోని 8వ నెంబర్ గది నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించగా… విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ ను కూడా సస్పెండ్ చేశారు. అంతే కాకుండా ప్రశ్నపత్రం లీకేజ్(Paper Leakage) అవడానికి ఓ విద్యార్థిని కారణం అంటూ ఆమెను డిబార్ చేశారు. అయితే పేపర్ లీక్‌ పై తనకు ఏ పాపం తెలియదని… ఓ వ్యక్తి కిటీకి వద్దకు వచ్చి పేపర్ చూపించాలని లేకపోతే రాయితో కొడతానని బెదిరించాడని.. అందువల్లే భయంతో పేపర్ చూపించినట్లు వాపోయింది. తనను డిబార్ చేయొద్దని.. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని విద్యార్థిని హైకోర్టును వేడుకుంది.

మరోవైపు పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటన తెలంగాణాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై కేసు నమోదు అయ్యింది. పది పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్‌ కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనితో కేటీఆర్ ట్వీట్‌ పై నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత,శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు ఉగ్గడి శ్రీనివాస్ కూడా సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు.

Also Read : Indian Air Force :అమెరికా నుండి తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లు

Leave A Reply

Your Email Id will not be published!